మహేష్, ప్రభాస్ లకే ఎలా సాధ్యం..!

Published on Jul 8, 2020 7:43 am IST

మహేష్, ప్రభాస్ ఇటీవల ఓ అరుదైన రికార్డ్స్ సొంతం చేసుకున్నారు. సౌత్ ఇండియాలోనే అత్యధిక సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉన్న హీరోలుగా అవతరించారు. మహేష్ ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య 10 మిలియన్స్ కి చేరుకోగా, ప్రభాస్ పేస్ బుక్ ఫాలోవర్లు 15 మిలియన్స్ కి చేరారు. సౌత్ ఇండియాలోనే ఈ ఫీట్ సాధించిన హీరోలుగా వీరిద్దరూ నిలిచారు. మరి ఇంత మంది స్టార్స్ ని వెనక్కి నెట్టి వీరిద్దరికే ఇది ఎలా సాధ్యం అయ్యింది అనేది ఆసక్తిగా మారింది.

మహేష్ టాప్ స్టార్ కావడంతో పాటు సోషల్ మీడియాలో అందరికంటే యాక్టీవ్ గా ఉన్నారు. వ్యక్తిగత, సోషల్ విషయాలు పంచుకుంటూ అభిమానులకు అందుబాటులో ఉంటారు. ఇక ప్రభాస్ ఇమేజ్ బాహుబలి తర్వాత భారీగా పెరిగింది. ఆయనకు దేశంలోని అన్ని పరిశ్రమలలో ఫ్యాన్ బేస్ ఏర్పడింది. దీనితో వీరి సోషల్ మీడియా ఫాలోయింగ్ భారీగా ఉందని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం :

More