ఎన్టీఆర్ డైరెక్టర్స్ ని వెయిటింగ్ లో పెడుతుంది అందుకే

Published on Feb 17, 2020 11:05 pm IST

ఆర్ ఆర్ ఆర్ తరువాత ఎన్టీఆర్ ఏ దర్శకుడితో సినిమా చేయనున్నాడని ఇప్పటి నుండే చర్చ మొదలైంది. ప్రముఖంగా ఆయన త్రివిక్రమ్ తో చేస్తారు అనే మాట వినిపిస్తుంది. అలాగే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే మూవీ టైటిల్ కూడా ఇదేనంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఎన్టీఆర్ మూవీ చేయనున్నారు అనే లిస్ట్ లో కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్, తమిళ యంగ్ డైరెక్టర్ అట్లీ కూడా ఉన్నారు. ఐతే ఈ ముగ్గురిలో ఏ ఒక్క దర్శకుడి పేరు అధికారికంగా బయటికి వచ్చింది లేదు. ఐతే ఎన్టీఆర్ వారిని కావాలనే వెయిట్ చేయిస్తున్నాడని తెలుస్తుంది.

ఆర్ ఆర్ ఆర్ మూవీ ఫలితం చూశాక మాత్రమే ఆయన ఏ దర్శకుడితో, ఎలాంటి కథతో సినిమా చేయాలనే నిర్ణయం తీసుకుంటాడట. ఆర్ ఆర్ ఆర్ భారీ విజయం సాదించిన నేపథ్యంలో ఎన్టీఆర్ కి కొత్తగా పాన్ ఇండియా ఇమేజ్ వచ్చే చేరే అవకాశం కలదు. కాబట్టి ఆయన తదుపరి చిత్రం కూడా అన్ని పరిశ్రమలకు సెట్ అయ్యేలా ఉన్న కథతో వచ్చే దర్శకుడిని ఎంపిక చేసుకోవచ్చు. ఇలాంటి ఆలోచనలతోనే ఎన్టీఆర్ ఏ ఒక్క దర్శకుడితో సినిమా ఫైనల్ చేయడం లేదని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :

X
More