శృతి హాసన్ అతనితో విడిపోవడానికి కారణం అదంట.

Published on Oct 9, 2019 11:43 pm IST

ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న శృతిహాసన్, మైకేల్ కోర్సలే ప్రేమలో పడి సినిమాలు నిర్లక్ష్యం చేసింది. ఐతే పెళ్ళివరకి వెళ్లిన వీరి బంధం అనుకోకుండా వీగిపోయింది. ఏమైందో ఏమో తెలియదు మైకేల్ శృతి నేను బ్రేక్ అప్ అయ్యామంటూ ప్రకటించేశాడు. శృతి మాత్రం ఈ విషయం పై ఎప్పుడూ నోరు మెదపలేదు. అతనితో బ్రేక్ అయిన తరువాత కొన్నాళ్ళు లండన్ లో లైవ్ మ్యూజిక్ షోలలో పాల్గొన్నారు. ఐతే తొలిసారి మైకేల్ తో ప్రేమ, బ్రేక్ అప్ వంటి విషయాలపై ఆమె స్పందించారు.

మంచు లక్ష్మి నిర్వహిస్తున్న టాక్ షో ఫీట్ అప్ విత్ ది స్టార్స్ కి హాజరైన శృతి తన బ్రేకప్ గురించి తొలిసారి మాట్లాడింది. “బయటకు కఠినంగా కనిపించినా నేను చాలా అమాయకంగా ఉంటాను. నేను చాలా ఎమోషనల్. దాంతో నా చుట్టు ఉన్న వారు నాపై ఆధిపత్యం చెలాయిస్తూ నన్ను కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తారు. నన్ను తమ ఆధీనంలో ఉంచుకోవాలనుకుంటారు. అయితే అవన్నీ నాకు మంచి అనుభవాలే. మైకేల్‌తో బ్రేకప్ దురదృష్టకరం`”అని శృతి చెప్పింది. మైకేల్ శృతి పై ఆధిపత్యం చూపడం వలెనే తనతో విడిపోయానని శృతి చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం :

X
More