‘శ్రీముఖి’ ఈ సినిమాతోనైనా హీరోయిన్ గా నిలబడుతుందా ?

‘శ్రీముఖి’ ఈ సినిమాతోనైనా హీరోయిన్ గా నిలబడుతుందా ?

Published on Jul 8, 2019 12:00 AM IST

ప్రముఖ బుల్లితెర యాంకర్ శ్రీముఖికి యూత్ లో సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. ఎప్పుడు తన ఫోటోలతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీముఖి ఈ మధ్య వరుసగా ఫోటో షూట్స్ చేస్తూ.. తన మేక్ ఓవర్ మొత్తం పూర్తిగా చేంజ్ చేస్తూ కొత్తగా కనిపిస్తోంది. అయితే ఆ చేంజ్ ఓ సినిమా కోసమట. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం శ్రీముఖి ప్రధాన పాత్రలో ఓ సినిమా రాబోతుంది.

కాగా ఈ చిత్రానికి నూతన దర్శకుడు ‘గౌతమ్ ఇ.వి.ఎస్’ దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులు, అలాగే ఈ సినిమాకి పనిచేసే ప్రధాన సాంకేతిక విభాగానికి సంబధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉందట. మరి ఈ సినిమాతోనైనా శ్రీముఖి టాలీవుడ్ లో హీరోయిన్ గా సెటిల్ అవుతుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు