ఆ ఇద్దరు స్టార్ హీరోలతో వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్న ప్రముఖ నిర్మాత సంస్థ.?

Published on Jul 9, 2020 9:10 pm IST

సూపర్ స్టార్ మహేష్ నటించిన లేటెస్ట్ సరిలేరు నీకెవ్వరు చిత్రంతో అదిరిపోయే విజయాన్ని నమోదు చేసుకుంది ప్రముఖ నిర్మాణ సంస్థ “ఏకే ఎంటర్టైన్మెంట్స్”. అయితే ఈ నిర్మాణ సంస్థ ఒక వెబ్ సిరీస్ ను తీయబోతున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. దీనికి ప్రముఖ రచయుత మధుబాబు నవల ఆధారంగా తెరకెక్కించనున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

“షాడో” టైటిల్ తో ప్లాన్ చేస్తున్న ఈ వెబ్ సిరీస్ కోసం ఇద్దరు స్టార్ హీరోల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో పాత్రలకు ఉన్న ఇంపార్టెన్స్ ఆధారంగా ‘అల్లరి’ నరేష్ మరియు దగ్గుబాటి రానా లు సెట్ అవుతారని అందుకే వారిని ఈ నిర్మాణ సంస్థ అప్రోచ్ కానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి అయితే ఈ సిరీస్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

సంబంధిత సమాచారం :

More