37ఏళ్ళ తర్వాత తన డిగ్రీ అందుకున్న సంచలన దర్శకుడు.!

Published on Mar 16, 2023 8:00 am IST

టాలీవుడ్ మరియు ఇండియన్ సినిమా దగ్గర తనదైన సినిమాలు తీసి ఓ ట్రెండ్ ని సెట్ చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. అయితే ఇప్పటికీ కూడా తన సినిమాలుతో ఏదొక సంచలనం నమోదు చేస్తున్నాడు. కాకపోతే ఇప్పుడు అంతా సెన్సేషన్ అవుతున్న అయ్యిన టాపిక్స్ తో తాను సినిమాలు చేస్తున్నాడు తప్ప తాను చేసిన సినిమా సెన్సేషన్ గా మారలేకపోతుంది.

మరి సోషల్ మీడియాలో కూడా యమ యాక్టీవ్ గా ఉండే వర్మ లేటెస్ట్ గా ఓ ఇంట్రెస్టింగ్ అంశాన్ని అయితే తాను పంచుకున్నాడు. తాను ఇప్పుడు 37 ఏళ్ళు తర్వాత తన ఆచార్య నాగార్జున యూనివర్సిటి నుంచి తన డిగ్రీ పట్టా అందుకున్నానని తెలిపారు.

తాను 1985 లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లో సివిల్ ఇంజనీరింగ్ చేస్తున్న సమయంలో అప్పుడు తీసుకోడానికి ఇంట్రెస్ట్ చూపించలేదని కానీ ఇప్పుడు ఫైనల్ గా తీసుకున్నానని ఈ మూమెంట్ ని అయితే వర్మ పంచుకున్నాడు. దీనితో తాను ఒక సివిల్ ఇంజనీర్ అని చాలా మందికి తెలిసింది. అలాగే ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అయ్యింది.

సంబంధిత సమాచారం :