“పుష్ప”లో స్పెషల్ సాంగ్ అదిరిపోద్దట.!

Published on Apr 25, 2021 7:23 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ అండ్ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. మన టాలీవుడ్ ఇంటిలిజెంట్ ఫిల్మ్ మేకర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ పక్కా మాస్ మసాలా డ్రామాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఇదిలా ఉండగా ఇది బన్నీ కి సుకుమార్ కి హ్యాట్రిక్ సినిమా కావడంతో మరిన్ని ప్రత్యేక అంచనాలు కూడా ఉన్నాయి.

అయితే మరియు ఇప్పటి వరకు వీరి కాంబోలో వచ్చిన రెండు చిత్రాలు మ్యూజికల్ పరంగా సెన్సేషనల్ హిట్స్ అందుకే దీనిపై మరో లెవెల్ అంచనాలు ఉన్నాయి. అలాగే దేవిశ్రీ సుకుమార్ కాంబో అన్నా ఐటెం సాంగ్ స్పెషల్ అట్రాక్షన్. అలాగే ఈ ముగ్గురికి కూడా.. ఆర్య, ఆర్య 2 లలో కూడా సాంగ్ పెద్ద హిట్ అయ్యాయి. మరి లేటెస్ట్ టాక్ ప్రకారం పుష్ప లో కూడా అదిరే ఐటెం సాంగ్ కట్ చేశారట.

ఆల్రెడీ ఈ సాంగ్ కోసం ఆ మధ్య టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు ఆ సాంగ్ కంప్లీట్ కూడా అయ్యినట్టు గాసిప్.. మరి ఈ సాంగ్ ఆన్ స్క్రీన్ పై అదిరిపోద్దట. ఇప్పటి వరకు వీరి కెరీర్ లో వచ్చిన ఐటెం సాంగ్స్ లో ఇది బెస్ట్ గా నిలవడమే కాకుండా చాలా కాలంగా బన్నీ నుంచి మిస్సవుతున్న మాస్ డాన్స్ ఫీస్ట్ కూడా ఇందులో ఉండనుంది అని తెలుస్తుంది. మరి సుకుమార్ ఏ లెవెల్లో ప్లాన్ చేసారో తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :