“పుష్ప” రూమర్స్ ను కొట్టిపారేసిన స్టార్ నటుడు.!

Published on Sep 30, 2020 9:00 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా మన టాలీవుడ్ ఇంటెలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. ఈ చిత్రంతో బన్నీ బాలీవుడ్ మార్కెట్ లోకి అడుగు పెట్టనున్నాడు. అయితే ఈ చిత్రానికి మాత్రం ఏదొక విధంగా షూట్ కు అడ్డు వస్తూనే ఉంది. లాక్ డౌన్ తో పెద్ద బ్రేక్ వస్తే ఆ తర్వాత కూడా షూట్ ని మొదలు పెడదాం అని అనుకుంటే మళ్ళీ ఏదొక చిక్కు వచ్చి ఆలస్యం అయ్యింది.

ఇక ఇప్పుడు ఎట్టకేలకు షూట్ ఫిక్స్ అయ్యింది. అయితే ఈ చిత్రంలో అన్నిటికన్నా ఎక్కువ ఆసక్తికరంగా మారిన అంశం మాత్రం ఈ సినిమాలో విలన్ రోల్ లో ఎవరు నటిస్తారు అని. సుకుమార్ రాసుకున్న ఈ పవర్ ఫుల్ రోల్ పై కూడా ఏదొక వార్త అలా వినిపిస్తూనే ఉంది. ఈ రోల్ కు గాను పలువురు స్టార్ నటుల పేర్లు వినిపించాయి.

అలా వినిపించిన వారిలో కోలీవుడ్ స్టార్ నటుడు మాధవన్ పేరు కూడా ఒకటి. కానీ మాధవన్ మాత్రం ఈ రూమర్స్ ను కొట్టి పారేసారు. తాను ఈ చిత్రంలో నటించడంలేదని సోషల్ మీడియాలో తెలిపి జోరుగా కొనసాగుతున్న ఈ వార్తలకు బ్రేక్ వేశారు. దీనితో మరోసారి ఈ చిత్రంలో విలన్ రోల్ ను ఎవరు పోషిస్తారా అన్నది ఆసక్తిగా మారింది.

సంబంధిత సమాచారం :