రెండేళ్లయినా మిస్టరీగా ఉండిపోయిన ఈ స్టార్ హీరో మరణం.!

Published on Jun 14, 2022 10:00 pm IST

గడిచిన రెండేళ్ల కాలంలో కరోనా విషాదమే అనుకుంటే దానికన్నా అదే సమయం లో ఇండియన్ సినిమా దగ్గర పలువురు దిగ్గజాలు తిరిగి రాని లోకాలకు పర్యంతం అవడం మరింత విషాదంగా నిలిచింది. అయితే వీటిలో కూడా ఇప్పటికీ ప్రేక్షకులకు తలుచుకుంటే కన్నీరు వచ్చే మరణ వార్త బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం. ఈరోజు జూన్ 14తో సుశాంత్ అనుమానాస్పదంగా మరణించి రెండేళ్లు అయ్యింది.

ఎన్నో అనేక కీలక మలుపులు తిరిగిన ఈ టాలెంటెడ్ హీరో అకాల మరణం ఇప్పటికీ ఒక అంతు చిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. అసలు ఈ మరణానికి కారణం ఏంటి అనేది ఇంకా తెలకపోవడం సుశాంత్ అభిమానుల్లో ప్రశ్నార్ధకంగా నిలిచిపోయింది. దీనితో ఈరోజు మళ్లీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు. మరి ఈ అతి పెద్ద మిస్టరీ ఎప్పుడు వీడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :