కొడుకు సినిమాలో విలన్ గా స్టార్ హీరో..?

Published on Jul 3, 2020 1:30 am IST


మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే నటన అంటే ఎంతవరకు అయినా సరే వెళ్లగలిగే అతి తక్కువ మంది హీరోల్లో “చియాన్” విక్రమ్ కూడా ఒకరు. చియాన్ సినిమాలు అంటే అటు తమిళ్ తో పాటుగా మన తెలుగులో కూడా మంచి ఆదరణ ఉంది. ఇదిలా ఉండగా విక్రమ్ కొడుకు ధృవ్ కూడా మన తెలుగు బ్లాక్ బస్టర్ “అర్జున్ రెడ్డి” సినిమా రీమేక్ తో తమిళ్ తెరకు పరిచయం అయ్యి మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.

అయితే ఇప్పుడు ఈ ఇద్దరు తలైవర్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో “పేట” లాంటి సినిమా తీసి మంచి విజయాన్ని అందుకున్న కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించనున్నారు. దీనితో ఇద్దరు తండ్రి కొడుకులు ఒకే చిత్రంలో నటించడం అనేది మంచి హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఈ చిత్రంలో చియాన్ విక్రమ్ విలన్ రోల్ లో కనిపించనున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ పాయింట్ కాస్త ఆశక్తికరంగానే ఉన్నా కార్తిక్ సుబ్బరాజ్ టేకింగ్ ఎలా ఉంటుందో చూడాలి. మరి ఇంకా దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

More