101 నుంచి 70 కేజీలకు తగ్గిన స్టార్ హీరో.!

Published on Oct 31, 2020 12:00 pm IST

మన దక్షిణాది హీరోలు తమ సినిమాల కోసం కానీ పర్సనల్ లైఫ్ కోసం కానీ తమ పర్సనాలిటీని ఎంత వరకు అయినా చేంజ్ చేసుకోడానికి సిద్ధ పడతారు. అలా లేటెస్ట్ గా “RRR” చిత్రం కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రిపేర్ చేసిన బాడీ చూసి డెడికేషన్ కు తారక్ ను ఒక చక్కటి ఉదాహరణగా నిలిచాడు.

అయితే ఇప్పుడు కోలీవుడ్ కు చెందిన ఓ స్టార్ హీరోగా కూడా ఊహించని ట్రాన్స్ ఫర్మేషన్ తో అక్కడి సినీ వర్గాలను స్టన్ చేసాడు. ఆ హీరో మన తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా తెలుసు అతడే శింబు. ఈ హీరో ఎప్పటి నుంచో తెలుగు ఆడియెన్స్ కు సుపరిచితం. మల్టీ టాలెంట్స్ కలిగిన ఈ 101 కేజీల బరువు నుంచి 70 కేజీలకు తగ్గి ఆశ్చర్యపరిచాడు.

ఇప్పుడు తగ్గిన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసి శింబు చాలా స్లిమ్ గా దర్శనం ఇచ్చాడు. అయితే ఇది కేవలం సినిమాల కోసం కాకుండా తాను పర్సనల్ గా అనుకోని తనని తానూ ఛాలెంజ్ చేసుకొని నిరూపించుకొనేందుకే చేసారట. మొత్తానికి మాత్రం శింబు చూపిన ఈ సడెన్ చేంజ్ చూసి అక్కడి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఇప్పుడు శింబు హీరోగా నటిస్తున్న “ఈశ్వరుడు” సంక్రాంతి విడుదలకు రెడీగా ఉంది.

సంబంధిత సమాచారం :

More