మాస్ కా దాస్ ని డైరెక్ట్ చేయనున్న సీనియర్ యాక్షన్ హీరో.!

Published on Jun 19, 2022 2:05 pm IST

టాలీవుడ్ యూత్ లో మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరోస్ లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కూడా ఒకడు. రీసెంట్ గానే తన “అశోక వనంలో అర్జున కళ్యాణం” చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అలాగే దీనితో పాటుగా తన లైనప్ లో మంచి ఇంట్రెస్టింగ్ చిత్రాలను సెట్ చేసుకుంటూ వెళ్తున్న ఈ యంగ్ హీరో నుంచి ఇప్పుడు మరో ఆసక్తికర ప్రాజెక్ట్ ఇప్పుడు అనౌన్స్ అయ్యింది. అయితే ఇది ఒకింత స్పెషల్ ప్రాజెక్ట్ అని చెప్పాలి.

ఎందుకంటే ఈ సినిమాని ప్రముఖ స్టార్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వం వహించబోతున్నారు. అయితే తాను ఒక్క దర్శకత్వమే కాకుండా సినిమా కథ అలాగే నిర్మాతగా కూడా తానే వ్యవహరిస్తున్నారు. మరి ఈ చిత్రంతోనే టాలీవుడ్ లో ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా పరిచటం కాబోతున్నట్టు అనౌన్స్ చేశారు. మొత్తానికి అయితే ఈ ప్రాజెక్ట్ చాలా స్పెషల్ గా ఉందని చెప్పాలి. రానున్న రోజుల్లో మరిన్ని ఆసక్తికర అప్డేట్స్ రానున్నాయని చెప్పాలి.

సంబంధిత సమాచారం :