“వకీల్ సాబ్” లిస్ట్ లో ఈ స్టార్ హీరోయిన్..?

Published on Jul 3, 2020 8:05 pm IST

దీర్ఘకాలిక విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న చిత్రం “వకీల్ సాబ్”. బాలీవుడ్ పింక్ చిత్రానికి రీమేక్ గా తెరేకెక్కుతున్న ఈ చిత్రంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పటికే తుది దశ వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇంకా చాలా తక్కువ టాకీ పార్ట్ మాత్రమే మిగిలి ఉంది. ఈ మిగిలిన కొంచెం చిత్రాన్ని పరిస్థితులు సద్దుమణిగాక మెల్లగానే షూటింగ్ ప్రారంభించాలని మేకర్స్ ఇప్పటికే తమ ప్లాన్ ని సిద్ధం చేసుకున్నారు.

అయితే ఈ చిత్రంలో మిగిలి ఉంది కేవలం కొన్ని సన్నివేశాలు మాత్రమే అని అందరికీ తెలుసు. ఈ సన్నివేశాలలో స్టార్ హీరోయిన్ శృతిహాసన్ జాయిన్ కానుంది అని అప్పుడు వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ పేరు కూడా వకీల్ సాబ్ లిస్ట్ లో ఉన్నట్టు బజ్ వినిపిస్తుంది. ఈ చిత్రంలోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కోసం మిల్కీబ్యూటీ తమన్నా పేరు పరిగణలో ఉన్నట్లు తెలుస్తోంది.

మరి ఈమె శృతి హాసన్ ను రీప్లేస్ చేసి తీసుకుంటున్నారా లేక మరే ఇతర రోల్ ఏదన్నా ఉందా అన్నది తెలియాల్సి ఉంది. ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీరామ్ వేణు శరవేగంగా తెరకెక్కించగా ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More