చరణ్ సరసన హీరోయిన్ ఉండే అవకాశం ఉందా..?

Published on Jul 15, 2020 5:47 pm IST

ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మరో స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో భారీ పీరియాడిక్ మల్టీ స్టారర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కరోనా మూలాన ఈ భారీ ప్రాజెక్ట్ అందాక తాత్కాలిక బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది.

ఇదిలా ఉండగా చరణ్ దీనితో పాటుగా మరికొన్ని మల్టీ స్టారర్ చిత్రాల్లో నటిస్తున్నారని టాక్ వినిపించింది. అలాంటి వాటిలో తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఆచార్య” సినిమా కూడా ఒకటి. ఈ చిత్రంలో రామ్ చరణ్ నక్సల్ లీడర్ గా కనిపించనున్నారని తెలిసిందే.

ఇప్పుడు ఈ రోల్ కు గాను ఒక స్టార్ హీరోయిన్ పేరు పరిశీలనలో ఉందని టాక్ వినిపిస్తుంది. కానీ ఈ సినిమాలో అంత ఇంపార్టెంట్ రోల్ కు హీరోయిన్ కూడా ఉంటే అది రొటీన్ గానే అనిపించే అవకాశం ఉంది. అలా అని కొరటాల నరేషన్ ను కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. ప్రస్తుతానికి అయితే రామ్ చరణ్ సరసన స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

More