ఆ స్టార్ సింగర్ గొంతు పోయింది అనే వార్తపై క్లారిటీ.!

Published on Sep 22, 2021 8:23 am IST

మొత్తం ఇండియన్ సినిమాలో మ్యూజిక్ ఎంతటి పాత్ర పోషిస్తుందో అందరికీ తెలిసిందే.. అలాగే ఈ సంగీత ప్రపంచంలో కేవలం కొన్ని గాత్రాలకి మాత్రం ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. కొంతమంది గాయనీ గాయకుల గొంతులే ఇండియన్ సినిమాలో ఒక అరుదైన గౌరవాన్ని తీసుకొచ్చాయి. మరి అలాంటి గాత్రం ఉన్న స్టార్ సింగర్స్ లో స్టార్ బాలీవుడ్ సీనియర్ మోస్ట్ సింగర్ కమ్ కంపోజర్ బప్పీ లహరి కూడా ఒకరు.

‘ఐ యామ్ ఏ డిస్కో డాన్సర్’ అంటే ఇండియా మొత్తం ఊగింది. ఇలా తనదైన శైలి పాటలతో మ్యూజిక్ లవర్స్ కి ఓ లెవెల్ ట్రీట్ ఆయన ఇచ్చారు. కానీ అనూహ్యంగా ఆయనపై ఊహించని వార్తలు వైరల్ అవ్వడం మొదలయ్యాయి. ఇటీవల ఆయనకు కరోనా సోకడం మూలాన అతని గొంతు పోగొట్టుకున్నారని పలు వార్తలు వైరల్ కాగా వాటి అన్నిటికీ బప్పీ తన గొంతు తోనే సమాధానం ఇచ్చారు.

తన గొంతులోనే ఓ సాంగ్ ని పాడి ఆ వీడియోని వదిలి తాను బాగానే ఉన్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి బప్పి లహరి కెరీర్ లో ఎన్నో హిస్టారికల్ హిట్ నంబర్స్ కూడా ఉన్నాయి. తెలుగులో అయితే అల్లరి నరేష్ “యాక్షన్ 3డి” సినిమాకి కూడా సంగీతం ఇచ్చి ఓ హిట్ సాంగ్ ని కూడా ఆలపించారు.

సంబంధిత సమాచారం :