తగ్గే ప్రసక్తే లేదంటున్న ఈ టాప్ నిర్మాత..!

Published on Jul 3, 2020 10:10 pm IST

ఎంత బడా ప్రాజెక్ట్ అయినా సరే వెండితెర పై కనిపించాలి అంటే కనిపించకుండా వెనుకే ఉండి నిరంతరం శ్రమించే వారి కష్టం ఎంతో ఉంది. కానీ వీరందరినీ వెనకుండి నడిపించేది మాత్రం ఒక్క నిర్మాత మాత్రమే అని చెప్పాలి. మనం వెండితెరపై చూసే ప్రతీ ఫ్రేమ్ నిర్మాత జేబులోంచి వచ్చిన రూపాయే.. కానీ ఇప్పుడు అలాంటి ఎందరో నిర్మాతలకు ఈ కరోనా గట్టి దెబ్బే వేసింది అని చెప్పాలి.

ముఖ్యంగా ఎక్కువ బడ్జెట్ తో తీసిన చిత్రాలు కూడా ఉన్నాయి. కేవలం అలాంటివి మాత్రమే కాకుండా ఎన్నో మీడియం బడ్జెట్ సినిమాలను కూడా తెలుగు ఆడియన్స్ కు అందించిన టాప్ నిర్మాతలలో దిల్ రాజు కూడా ఒకరు. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాతగా రెండు పెద్ద ప్రాజెక్టులనే చేతిలో పట్టుకున్నారు. అవే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేస్తున్న “వకీల్ సాబ్” మరొకటి నాచురల్ స్టార్ నాని మరియు సుధీర్ బాబులు హీరో యాంటీ హీరోలుగా నటించిన చిత్రం “వి”. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రాలు ఆగిపోవాల్సి వచ్చింది.

దీనితో ఇదే సమయంలో ఓటీటీ సంస్థలు షూటింగ్స్ పూర్తి అయిపోయిన సినిమా నిర్మాతలకు భారీ ఆఫర్లు ఇస్తున్నారు. అలా గత కొన్నాళ్ల కితం ఈ రెండు చిత్రాలకు భారీ ఆఫర్ ఇచ్చారని టాక్ వినిపించింది. కానీ వకీల్ సాబ్ షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో అందులో ఎలాంటి నిజమూ లేదని తేలింది. కానీ “వి” ఓ ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ పెద్ద ఆఫర్ నే ఇచ్చినట్టుగా తెలిసింది.

కానీ అప్పుడు దిల్ రాజ్ ఆ ఆఫర్ ను నిరభ్యంతరంగా తిరస్కరించేశారు. కానీ మళ్లీ అదే చిత్రానికి ముందు ఆఫర్ కన్నా భారీ ఆఫర్ వచ్చిందట అయినప్పటికీ దిల్ రాజు ఈ ఫ్యాన్సీ ధరను కూడా లెక్క చేయలేదని తెలుస్తుంది. దీనితో దిల్ రాజు ఏది ఏమైనప్పటికీ మాత్రం ఈ చిత్రాన్ని థియేటర్ లొనే విడుదల చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నారని చెప్పాలి.

సంబంధిత సమాచారం :

More