ఈ విలక్షణ నటి సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ అయ్యాయి!

Published on Dec 3, 2020 12:06 pm IST

మన సినిమాల్లో కొంతమంది మాత్రమే ఫీమేల్ విలన్స్ బాగా క్లిక్ అయ్యిన వారు ఉన్నారు. అయితే నటిగా ఎలాంటివో రోల్స్ లో అయినా మెప్పించగలరు ఈ రోల్ అయితే పర్ఫెక్ట్ అనిపించేలా చేయడం కొంతమందికే సాధ్యం అవుతుంది. అలా పలు విలక్షణ రోల్స్ చేసి తమిళ్ మరియు తెలుగు ఆడియెన్స్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్.

ఇప్పుడు ఈమె సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ అయ్యాయి అని ఆమె చెప్తున్నారు. తన ఇన్స్టాగ్రమ్ మరియు ట్విట్టర్ అకౌంట్స్ రెండు కూడాను నిన్న రాత్రి హ్యాక్ అయ్యాయి అని తాను ఇప్పటికీ కూడా వాటిని యాక్సిస్ చెయ్యలేకపోతున్నాని తెలిపారు. వాటిని సాధ్యమైనంత త్వరలో తిరిగి పొందేందుకు ప్రయత్నం చేస్తున్నాని..

అందుకే కొన్ని రోజులు ఆ అకౌంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని తన ఫాలోవర్స్ కు ఒక ప్రెస్ నోట్ ద్వారా తెలిపారు. ఒకవేళ మళ్ళీ అవి తిరిగి వచ్చాక తాను అందరికీ సమాచారం ఇస్తానని తెలిపారు. ప్రస్తుతం ఈమె తెలుగులో మాస్ మహారాజ్ హీరోగా నటిస్తున్న “క్రాక్” లో ఒక కీలక రోల్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More