ఈసారి “ఏజెంట్” ఓటిటి ట్రీట్ నమ్మొచ్చేమో..

ఈసారి “ఏజెంట్” ఓటిటి ట్రీట్ నమ్మొచ్చేమో..

Published on Mar 9, 2025 10:32 PM IST

అక్కినేని వారి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో అఖిల్ అక్కినేని కూడా ఒకరు. మరి అఖిల్ హీరోగా సాక్షి వైద్య హీరోయిన్ గా మన టాలీవుడ్ స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో చేసిన భారీ చిత్రం “ఏజెంట్” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఎప్పుడో 2023లో థియేటర్స్ లో వచ్చిన ఈ చిత్రం అప్పుడు నుంచి ఓటిటిలోకి రాలేదు.

అయితే ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు సోనీ లివ్ వారు సొంతం చేసుకోగా అందులో కూడా చాలాసార్లు ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఇక లేటెస్ట్ గా కొత్త డేట్ అంటూ మార్చ్ 14ని కూడా ఇచ్చారు. మరి ఈ డేట్ లో ఈసారి అయినా సినిమా వస్తుందా అనే డౌట్ మళ్ళీ ఎక్కడో లేకపోలేదు.

కానీ ఈసారి మాత్రం ఏజెంట్ ఓటిటి రిలీజ్ డెఫినెట్ గా వచ్చేలానే ఉందని చెప్పాలి. ఎందుకంటే మొన్న అనౌన్సమెంట్ తర్వాత ఇపుడు సోనీ లివ్ నుంచి ఏజెంట్ రిలీజ్ పై పోస్ట్ లు కూడా కంటిన్యూ అవుతున్నాయి. సో ఈసారి మాత్రం ఏజెంట్ ఓటిటి రిలీజ్ మిస్ అయ్యేలా లేదని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి హిప్ హాప్ తమిళ సంగీతం అందించగా అనీల్ సుంకర నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు