బిగ్ బాస్ ఎలిమినేషన్ అంచనాలు తలకిందులయ్యేలా ఉన్నాయి.

Published on Oct 11, 2019 8:27 am IST

మరో వారాంతం దగ్గరపడింది, అనగా బిగ్ బాస్ షో నుండి ఒకసభ్యుడు ఎలిమినేట్ అయ్యే సమయం దగ్గరపడిందని అర్థం. ఈ సారి ఎలిమినేషన్ లో ముగ్గురు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉండటం గమనార్హం. హీరో వరుణ్, సింగర్ రాహుల్, యాక్టర్ మహేష్ విట్టా ఎలిమినేషన్ కొరకు నామినేట్ కావడం జరిగింది. వీరిలో ఎవరిని హౌస్ లో ఉంచాలని ప్రేక్షకులు అనుకుంటున్నారు, ఎవరిని ఇంటికి పంపాలని అనుకుంటున్నారు అనేది ఇంకా రెండు రోజులలో తెలియనుంది.

ఐతే మెజారిటీ వర్గాల అంచనా ప్రకారం ఈ వారం మహేష్ విట్టా ఎలిమినేట్ అయ్యే అవకాశం వుంది. రాహుల్, వరుణ్ సేవ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చాలా మంది అంటున్న మాట. ఐతే ఇవ్వన్నీ అంచనాలు మాత్రమే అన్న విషయం మరిచి పోకూడదు. మహేష్ ని కొంత కాలంగా ఒక ప్రాంతీయ వర్గం సపోర్ట్ చేస్తూ వస్తుదని సమాచారం. ఇక మహేష్ ప్రవర్తన కారణంగా ప్రేక్షకుల నుండి సింఫతి సంపాదిస్తున్నాడని తెలుస్తుంది. అనూహ్యంగా అంచనాలను తలకిందులు చేస్తూ, ఈసారి ఎలిమినేషన్ నుండి వరుణ్, రాహుల్ లో ఒకరు ఎలిమినేట్ అయినా ఆశ్చర్యం లేదు.

సంబంధిత సమాచారం :

More