బిగ్ బాస్ 4 – ఫైనల్ టికెట్ కోసం ఈ ఇద్దరూ పాట్లు.!

Published on Dec 3, 2020 4:04 pm IST

మన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ ఇప్పుడు నాలుగో సీజన్ ను కూడా ముగించే సమయం వచ్చేసింది. దేనేయితో మిగిలి ఉన్న కొద్ది మంది కంటెస్టెంట్స్ లో పోటీ మరింత రసవత్తరం అయ్యింది. అయితే ఇప్పుడు ఫైనల్స్ రేస్ కు గాను ముందుగానే ఎవరో ఒక లక్కీ కంటెస్టెంట్ కు డైరక్ట్ ఫైనల్స్ కార్డు వస్తుందన్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు హౌస్ లో కూడా ఇదే ప్రక్రియ సాగుతుంది. అయితే ఈరోజు ఆ పాస్ ఎవరికి దొరుకుతుంది అన్నది ఆసక్తికరంగా మారగా దాని కోసం ముందు నుంచీ ఈ ఇద్దరు కంటెస్టెంట్స్ ఫ్రెండ్లీ పోటీ పడుతున్నారు. వారే షోయెల్ మరియు అఖిల్, బిగ్ బాస్ ఒక ఉయ్యాలలో ఎవరైతే ఎక్కువసేపు కూర్చొని ఉంటారో వారికే ఫైనల్స్ టికెట్ దక్కుతుంది అని అనౌన్స్ చెయ్యగా ఈ ఇద్దరే పోటాపోటీగా వెళ్లిపోయారు.

దీనితో ఇక అక్కడే వారిద్దరికీ అన్నీ దీనితో వారి పాట్లు అన్ని ఇన్ని కాదు.. పైగా వారికి అభిజీత్ అన్నీ సర్వీస్ చెయ్యడం హైలైట్.ఇక మిగతా వారు మాత్రం అలా చిల్ గా ఎంజాయ్ చేస్తూ వారు ఎప్పుడు దిగుతారా అని చూస్తున్నారు. మరి ఈ టికెట్ వారు దక్కించుకుంటారో అన్నది తెలియాలి అంటే ఈరోజు ఎపిసోడ్ మిస్సవ్వకుండా చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :

More