“సర్కారు” కి వారిద్దరిలో ఈ విలక్షణ నటుడు ఫిక్స్.?

Published on Jul 18, 2021 7:10 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట”. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ హ్యాట్రిక్ విజయాల తర్వాత సినిమా అనే కాకుండా పెట్ల మాస్ టేకింగ్ తన సబ్జెక్టు పై వినిపిస్తున్న బజ్ నిమిత్తం మరింత ఇంపాక్ట్ ఈ సినిమాపై నమోదు అయ్యింది.

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో పలువురు స్టార్ నటులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారన్న బజ్ ఉంది. మరి యాక్షన్ కింగ్ అర్జున్ పేరు కూడా వినిపించింది. ఆ తర్వాత వెర్సిటైల్ నటుడు సముథిరఖని పేరు కూడా వినిపించింది. అయితే ఫైనల్ గా ఈ సినిమాలో మాత్రమే కనిపించేది సముథిరఖని అనే తెలుస్తుంది.

తానే ఈ చిత్రంలో ఫిక్స్ అయ్యినట్టుగా నయా టాక్. అర్జున్ పాత్రపై కొన్నాళ్లుగా బజ్ నడిచినా అయన ఈ సినిమాలో లేనట్టు వినికిడి. ఇక ఈ చిత్రంలో మహేష్ సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :