తారక్ – కొరటాల ప్రాజెక్ట్ లైన్ ఇదేనా.?

Published on Apr 15, 2021 4:00 pm IST

లేటెస్ట్ గానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నెక్స్ట్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సంగతి చూసాం. తన బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో మళ్ళీ యంగ్ టైగర్ వర్క్ చేస్తుండడం మంచి హాట్ టాపిక్ అయ్యింది. మరి ఇప్పుడు మళ్ళీ ఈ సెన్సేషనల్ కాంబో రిపీట్ కానుండడంతో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇది వరకే జనతా గ్యారేజ్ లాంటి సాలిడ్ సబ్జెక్టుతో మంచి ట్రీట్ ఇచ్చారు.

దీనితో ఈ సారి ఎలాంటి కాన్సెప్ట్ తో వస్తారో అన్నది ఆసక్తిగా మారింది. మరి ఇప్పుడు దానికి సంబంధించే లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది. అయితే ఇందులో తారక్ బయట ప్రపంచం కోసం పెద్దగా తెలియని ఓ ఇనోసెంట్ పాత్రలో కనిపిస్తాడు అట. మరి అలాంటి పాత్ర నగర ప్రాంతాల్లోకి వస్తే ఎలా ఉంటుంది తాను ఎలా బ్రతకగలడు అన్న టైప్ లో ఉంటుందట. అయితే ఇలాంటి పాత్రలో తారక్ ను చూడడం అనేది కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి కొరటాల తన మార్క్ తో ఎలా డీల్ చేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :