ఈ వీకెండ్ “బిగ్ బాస్ 4” ఎపిసోడ్ స్పెషల్ గురు.!

Published on Oct 21, 2020 4:04 pm IST

మన తెలుగు స్మాల్ స్క్రీన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ విజయవంతంగా మూడు సీజన్లను ముగించుకొని నాలుగో సీజన్ కూడా మంచి రసవత్తరంగా కొనసాగుతుంది. మొదటలో కాస్త చప్పగానే ఉన్నా తర్వాత తర్వాత మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ మరియు కాంట్రవర్సీలతో బిగ్ బాస్ వీక్షకులను అలరిస్తుంది. అయితే ఇప్పుడు సగానికి చేరుకున్న ఈ షోలో గత వారపు ఎలిమినేషన్ విషయంలో ఆడియెన్స్ కాస్త అసహనంగా ఉన్నారు.

కానీ ఇప్పుడు ఈ వారాంతం ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా ఉండనుంది అని చెప్పాలి. అంతే కాకుండా ఈ వీకెండ్ ఎపిసోడ్ కూడా ఎలా ఉండనుందో తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఈసారి ఎలిమినేషన్ జోన్ లో ఉన్న మోనాల్ గజ్జర్ మరియు నోయెల్ ల విషయంలోనే ఆసక్తి నెలకొంది. మొదటి కంటే ఈ ఇద్దరు తమ గ్రాఫ్ ను పోగొట్టుకున్నారు.

దీనితో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది కామనే కానీ ఈ వారాంతం హోస్ట్ గా ఎవరు కనిపిస్తారు అన్నది సస్పెన్స్ గా మారింది. నాగ్ షూట్ కారణంగా కాస్త బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. దీనితో ఎవరు హోస్ట్ గా చేస్తారు అన్నది కూడా ఆసక్తిగా మారింది. ఇలా ఒక ఆసక్తికర ఎలిమినేషన్ మరియు కొత్త హోస్ట్ ఎవరు అన్న దానితో ఈ ఎపిసోడ్ కాస్త స్పెషల్ గా మారింది.

సంబంధిత సమాచారం :

More