“హను మాన్” పాన్ వరల్డ్ రిలీజ్ పై డైరెక్టర్ క్లారిటీ.!

Published on May 12, 2023 10:00 am IST

ప్రస్తుతం మన టాలీవుడ్ సినిమా నుంచి ఎలాంటి ప్రోడక్ట్ లు ఇండియన్ సినిమా దగ్గర వస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా యంగ్ దర్శకులు కూడా తమ సత్తా చాటుతు పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ లెవెల్ సినిమాలు కూడా చేస్తున్నారు. అలాంటి దర్శకుల్లో అవార్డ్ విన్నింగ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా ఒకరు. మరి ఈ దర్శకుడు ఇప్పుడు చేస్తున్న భారీ చిత్రమే “హను మాన్”.

యంగ్ హీరో తేజ సజ్జ తో అనౌన్స్ చేసిన ఈ సినిమా టీజర్ తో యూనానిమస్ టాక్ తెచ్చుకుంది. దీనితో ఈ సినిమాపై హైప్ వేరే లెవెల్ కి వెళ్లగా మేకర్స్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ లెవెల్ రిలీజ్ అంటూ బిగ్గెస్ట్ అనౌన్సమెంట్ చేసారు. అయితే ఈ టాలెంటెడ్ దర్శకుడు లేటెస్ట్ గా ఈ సినిమా పాన్ వరల్డ్ రిలీజ్ ఎందుకు చేస్తున్నామో తెలిపాడు.

మొదటగా సినిమాని అనౌన్స్ చేసినప్పుడు నిర్మాత నిరంజన్ రెడ్డి గారికి ఇండియా లో ఇతర భాషల నుంచి సినిమా పాన్ ఇండియా రిలీజ్ కావాలని కోరుకున్నారని దీనితో హిందీ సహా ఇతర భాషల్లో ముందు ప్లాన్ చేయగా తర్వాత చైనా, జపాన్, కొరియా లాంటి దేశాల నుంచి కూడా నిర్మాతకి కాల్స్ వచ్చాయని దీనితో హను మాన్ లాంటి యూనివర్సల్ సబ్జెక్ట్ ని తాము పాన్ వరల్డ్ లెవెల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశామని తెలిపాడు. మరి ఈ అవైటెడ్ సినిమా అయితే ఎప్పుడు వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :