“కేజీయఫ్ 2” టీజర్ ను ఆరోజే ఎందుకు ప్లాన్ చేసారంటే!

Published on Dec 2, 2020 9:50 pm IST

ఇప్పుడు మన దక్షిణాది నుంచి రాబోతున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ చిత్రాల్లో కన్నడ రాకింగ్ స్టార్ యష్ మరియు ప్రశాంత్ నీల్ ల కాంబోలో వస్తున్న పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ “కేజీయఫ్ చాప్టర్ 2” కూడా ఒకటి. చాప్టర్ 1 పాన్ ఇండియన్ లెవెల్లో సంచలనం రేపడంతో దీనిపై తారా స్థాయి అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా టీజర్ పై ఎప్పటి నుంచో బజ్ వినిపిస్తుంది. ఈ దసరాకు ముందు అనుకున్న ఈ టీజర్ తర్వాత అలా మిస్సవుతూ వచ్చింది. కానీ కొన్నాళ్ల కితం మేకర్స్ ఈ టీజర్ ను వచ్చే జనవరి 8న టాక్ వచ్చింది. అయితే అంతకు ముందు సంక్రాంతి రేస్ లో సినిమాను ఉంచాలి అనుకున్నారు.

కానీ అది అవ్వలేదు దీనితో ఆ సమయానికి టీజర్ ను ప్లాన్ చేసారు. ఇపుడు కూడా అలానే అదే తేదికి మేకర్స్ ఫిక్సయ్యి ఉన్నారని టాక్ వస్తుండగా అసలు మేకర్స్ అదే డేట్ కు ఎందుకు ఫిక్సయ్యారో అన్నది తెలుస్తుంది. సరిగ్గా జనవరి 8న తమ రాకీ భాయ్ యష్ పుట్టిన రోజు కావడంతో ఈ సెన్సేషనల్ సినిమా టీజర్ ను సెలబ్రేట్ చేసుకోడానికి అంతకన్నా సాలిడ్ రోజు మరొకటి లేదు కాబట్టే ఇలా ప్లాన్ చేసారు.

సంబంధిత సమాచారం :

More