మహేష్ తో రాజమౌళి చేసేది ఆ జోనరేనా?

Published on Jul 7, 2020 4:52 pm IST

ఈ ఏడాది మహేష్ ఫ్యాన్స్ బాగా కిక్ ఇచ్చిన న్యూస్ రాజమౌళితో మూవీ. ఈ సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు మూవీతో అందిన బ్లాక్ బస్టర్ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న ఫ్యాన్స్ కి, లాక్ డౌన్ సమయంలో రాజమౌళి తీపి కబురు చెప్పారు. ఓ టీవీ ఛానెల్ కి ఇచిన ఇంటర్వ్యూ లో భాగంగా రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ తరువాత మహేష్ తో మూవీ చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటి నుండి మహేష్ తో రాజమౌళి చేసే మూవీ జోనర్ ఏమై ఉంటుందనే చర్చ జోరుగా సాగుతుంది.

ఐతే మహేష్ తో రాజమౌళి మూవీ రెగ్యులర్ కమర్షియల్ అంశాలతో కూడిన కాంటెంపరరీ మూవీ అయ్యే అవకాశం ఎక్కువగా కలదని కొందరి వాదన. దానికి కారణంగా వారు చెవుతున్న లాజిక్ ఏమిటంటే…ఆయన చేసిన బాహుబలి ఎపిక్ డ్రామాగా రాగా, ఆర్ ఆర్ ఆర్ 1920నాటి పీరియాడిక్ డ్రామాగా వస్తుంది. ఈ రెండు చిత్రాలు పీరియాడిక్ జోనర్ లో తెరకెక్కినవే. కాబట్టి మహేష్ తో చేసే మూవీ ఆయన సమకాలీన అంశాలతో కూడిన కమర్షియల్ మూవీ అవుతుందని అంటున్నారు. మరి ఈ వాదనలో ఎంత వరకు నిజం అవుతుందో తెలియాలంటే ఇంకా కొన్నాళ్ళు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :

More