“సర్కారు వారి పాట”కి ఈ పని శరవేగంగా..!

“సర్కారు వారి పాట”కి ఈ పని శరవేగంగా..!

Published on Oct 30, 2020 7:01 AM IST

ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురాం దర్శకత్వంలో “సర్కారు వారి పాట” అనే మాస్ ఎంటర్టైనర్ లో నటించనున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రానికి రీసెంట్ గానే స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ను ఫిమేల్ లీడ్ గా కూడా ఖరారు చేసేసారు. అయితే మహేష్ దీనికి ముందు మూడు భారీ హిట్లు ఒకదాన్ని మించి మరొకటి కొట్టేసరికి ఈ ప్రాజెక్టు పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అందుకే ప్రతీ అంశం లోనూ అభిమానులు మరియు మేకర్స్ ప్రతిష్టాత్మకంగా అంచనాలు పెట్టుకొని తగు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. అలా సంగీతం పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. కానీ వాటికి తగ్గట్టుగానే థమన్ కూడా ఈ లాక్ డౌన్ సమయాన్ని వృథా చెయ్యకుండా శరవేగంగా పనులను పూర్తి చేసేస్తున్నాడు.

తన దర్శకుడు ఇచ్చిన ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించి ట్యూన్స్ పై వర్క్ చేసేస్తున్నట్టుగా తెలుపుతున్నారు. మహేష్ తో థమన్ కు ఎనర్జిటిక్ ఆల్బమ్స్ ఉన్నాయి. అందుకే అభిమానులు ఈ సారి ఆల్బమ్ పై కూడా ఖచ్చితమైన అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈసారి థమన్ ఎలాంటి సాంగ్స్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ను అందిస్తారో చూడాలి..

https://twitter.com/MusicThaman/status/1321842316173176833?s=20

సంబంధిత సమాచారం

తాజా వార్తలు