ఈ ఏడాది ప్రభాస్ పేరిట బాక్సాఫీస్ బొనాంజానేనా.?

Published on Jan 19, 2021 7:03 am IST

ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పేరు మన ఇండియన్ సినీ మార్కెట్ లోనే ఎంత పెద్దగా మారిందో తెలిసిందే. అందుకే తాను చేపట్టే ప్రతీ ప్రాజెక్ట్ కు గాను ఒక్కో దానిపై అంతకు మించిన స్థాయి అంచనాలు నెలకొంటున్నాయి. మరి అలా ఇప్పుడు ఇప్పుడు ప్రభాస్ లైనప్ లో మొత్తం నాలుగు సాలిడ్ ప్రాజెక్ట్ లు ఉన్నాయి.

మరి వీటిలో రెండింటితో ప్రభాస్ ఈ ఏడాదిలోనే బాక్సాఫీస్ బొనాంజా చూపిస్తాడని టాక్ గట్టిగా వినిపిస్తుంది. మరి మొదటగా రాధాకృష్ణతో తెరకెక్కిస్తున్న పీరియాడిక్ లవ్ స్టోరీ “రాధే శ్యామ్”ను ఖచ్చితంగా సమ్మర్ రిలీజ్ గా తీసుకువస్తుండడం ఖాయం అవ్వగా..

సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో స్టార్ట్ చేసిన భారీ యాక్షన్ థ్రిల్లర్ దాదాపు దసరా రేస్ లోనే నిలబెడతారు అని బజ్ గట్టిగా వినిపిస్తుంది. మరి ఈ రెండు కనుక వచ్చినట్టయితే ప్రభాస్ ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ ఏమో కానీ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మాత్రం సరికొత్త లెక్కలు ఒకే ఏడాదిలో నెలకొల్పడం ఖాయం అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :