“టక్ జగదీష్” పై అవన్నీ సుత్తి రూమర్స్.!

Published on Jul 21, 2021 9:59 am IST

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రాల్లో మోస్ట్ అవైటెడ్ రిలీజ్ గా ఉన్న చిత్రం “టక్ జగదీష్”. తన హిట్ సినిమా “నిన్ను కోరి” దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ క్లాస్ అండ్ మాస్ ఎంటర్టైనర్ కోసం అభిమానులు సహా ఫ్యామిలి ఆడియెన్స్ కూడా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా ఓటిటిలోనే విడుదల అవుతుంది అని కొన్ని రూమర్స్ వైరల్ అవుతున్నాయి.

వీటిపై ఇది వరకే టాలీవుడ్ పీఆర్వో లు సినీ ప్రముఖులు క్లారిటీ కూడా ఇచ్చారు ఈ చిత్రం థియేటర్స్ లోనే విడుదల అని. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాకి ఓ ఓటిటి సంస్థ నుంచి 45 కోట్ల మేర భారీ ఆఫర్ వచ్చింది అని అందుకే డైరెక్ట్ ఓటిటిలో ఈ చిత్రం వస్తుంది అని రూమర్ ని వదిలారు. కానీ ఇదంతా సుత్తి రూమర్స్ అని తెలుస్తుంది.

అసలు ఈ సినిమా యూనిట్ ఓటిటి రిలీజ్ పై అసలు ఆసక్తిగానే లేరని ఎట్టి పరిస్థితుల్లో కూడా థియేటర్స్ లోనే ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని ఫిక్స్ అయ్యారని టాలీవుడ్ సినీ పండితులు ఫైనల్ గా చెప్తున మాట. సో ఆ పుకార్లు ఏవి నమ్మకూడదని టాలీవుడ్ ఆడియెన్స్ కి ఇది మనవి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందివ్వగా షైన్ స్క్రీన్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :