మహర్షి లో హైలైట్ అయ్యే సీన్లు ఇవే !

Published on May 4, 2019 11:00 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి ఈనెల 9న విడుదలకానుంది. ఈ చిత్రం ఫై మహేష్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇక ఈ చిత్రానికి కొన్ని సన్నివేశాలు హైలైట్ అవుతాయని సమాచారం. అందులో అల్లరి నరేశ్ , మహేష్ బాబు మధ్య ఫ్రెండ్ షిప్ నేపథ్యం లో వచ్చే సన్నివేశాలు అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చే రామవరం ఎపిసోడ్ , ప్రెస్ మీట్ , నైట్ ఫైట్ సీక్వెన్స్ ఈ చిత్రానికి ఆయువు పట్టుగా నిలుస్తాయట. ఇక క్లైమాక్స్ కూడా చాలా ఎమోషనల్ గా ఉండి కంటతడి పెట్టిస్తుందట.

మరి ఇంతవరకు తన కెరీర్ లో ఒక్క బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకోలేకపోయిన డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ చిత్రం తో ఆ కోరిక తీర్చుకుంటాడోలేదో చూడాలి. దిల్ రాజు , అశ్వినీ దత్ , పీవీపీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :

More