‘మహర్షి’లో హైలెట్ అవుతున్న మూడు బ్లాక్ బస్టర్స్ !

Published on May 5, 2019 11:49 pm IST

‘మహర్షి’గా మహేశ్ బాబు మూడు వేర్వేరు పాత్రల్లో మూడు డిఫరెంట్ షేడ్స్ తోనూ.. ప్రతి పాత్ర లుక్ లో డిఫరెంట్ వేరియేషన్స్ తోనూ వెరీ స్టైలిష్ గా ఆకట్టుకుంటున్నప్పటికీ.. ‘మహర్షి’లో మాత్రం కథా పరంగా ‘శ్రీమంతుడు’ పోలికలు, డైలాగ్స్ పరంగా ‘బిజినెస్ మేన్’ ఛాయలు, షాట్స్ పరంగా ‘పోకరి’ లక్షణాలు.. ఇలా మొత్తానికి ‘మహర్షి’ పై మహేశ్ గత సూపర్ హిట్ సినిమాల ముద్ర చాలా బలంగానే కనిపిస్తోంది. ఇప్పుడిదే ‘మహర్షి’కి ప్రతికూలాంశంగా మారింది.

ఎక్కడో ఓ హాలీవుడ్ సినిమా నుండి ఒక షాట్ కాపీ కొడితేనే.. మన ప్రేక్షక దేవుళ్ళు ఆ కాపీ షాట్ ను పట్టుకుని సోషల్ మీడియాలో నానా హడావుడి చేస్తారు. మరి అలాంటిది తెలుగు సినిమాల్లో నుండే కాపీ కొడితే.. సరే కాపీ అనుకోకపోయినా ‘ప్రేరణే’ అనుకుందాం. మరీ అందరికీ తెలిసిన సినిమాల్లో నుండి ఎక్కువుగా ప్రేరణ పొందితే ఎలా ? ఇదివరకూ చూసిన సినిమాలానే ఉంది ఇది.. లేదా చాలా సినిమాల సమ్మేళనం ఈ సినిమా అని ప్రేక్షకులు భావిస్తే… సినిమా పరిస్థితి ఏంటి ? ఏది ఏమైనా ఆయా సినిమాల ముద్ర మాత్రం ‘మహర్షి’ పై చాలా స్పష్టంగా హైలెట్ అవుతొంది.

ముఖ్యంగా ‘మహర్షి’ పోస్టర్స్, సాంగ్స్ దగ్గర నుండీ మహేష్ గెటప్, సినిమా టీజర్, ట్రైలర్ వరకూ ఎక్కడో ఓ చోట ‘శ్రీమంతుడు’ గుర్తుకువస్తూనే ఉన్నాడు. రెండు కథా గమనాల్లోని ఇతివృత్తం ఒకేలా ఉండటం కూడా ఈ పోలికలకు కారణమై ఉండొచ్చు. అలాగే ట్రైలర్ లో ‘ప్రపంచాన్ని ఏలేద్దాం అనుకుంటున్నాను సర్ ‘ లాంటి డైలాగ్ ల్లో ‘బిజినెస్ మేన్’నే ఎక్కువుగా కనిపిస్తన్నాడు. దీనికి కారణం ‘బిజినెస్ మేన్’లో మహేశ్ బాబు పలికిన డైలాగ్ లు బాగా హైలెట్ అవ్వడమే. దాంతో ‘మహర్షి’లోనూ మహేశ్ అలాంటి డైలాగ్ లు పలికే సరికి, సహజంగానే ‘బిజినెస్ మేన్’ ఛాయలు ‘మహర్షి’లో ఉన్నాయనే భావన కలుగుతుంది.

ఇక ‘మహర్షి’లో స్టైలిష్ రన్నింగ్ లుక్ గాని, కొన్ని మ్యానరిజమ్స్ గాని పరిశీలిస్తే.. ‘పోకరి’నే గుర్తుకు వస్తాడు. దానిక్కూడా కారణం ‘పోకరి’లో మహేష్ బాబు రన్నింగ్ లుక్ అభిమానుల మనసుల్లో ఇప్పటికే ప్రత్యేకంగా నిలిచిపోవడమే. ఇప్పుడు సేమ్ అదే స్టైల్ ను, స్టిల్ ను ‘మహర్షి’లో వాడే సరికి షాట్స్ పరంగా కూడా ‘పోకరి’ లక్షణాలు.. ‘మహర్షి’లో బాగానే కనిపిస్తున్నాయి. ‘మహర్షి’ టీమ్ ఇవి కావాలని చెయ్యకపోయినా, తమ సినిమాలో.. వేరే సినిమాల ఛాయలు లేకుండా.. కనీసం కనిపించకుండా హైలెట్ కాకుండా జాగ్రత్త తీసుసుకోవాల్సింది. మరి ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ కామెడీ హీరో అల్లరి నరేష్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీదత్ మరియు పివిపి కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.

సంబంధిత సమాచారం :

More