ఎన్టీఆర్ సినిమాలో ముగ్గురు సీనియర్ హీరోలు ?

ఎన్టీఆర్ సినిమాలో ముగ్గురు సీనియర్ హీరోలు ?

Published on Jan 3, 2021 9:09 PM IST

ntr 11

‘అయినను పోయి రావలె హస్తినకు’ అంటూ ఎన్టీఆర్ తో దర్శకుడు త్రివిక్రమ్ తన తర్వాతి చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కోసం త్రివిక్రమ్ ఓ కీలక పాత్రను రాశాడని.. అది పక్కా రాజకీయ నాయకుడి పాత్ర అని తెలుస్తోంది. అలాగే కన్నడ స్టార్ ఉపేంద్ర కూడా మరో కీలక పాత్రలో కనిపించబోతున్నాడట. మరో సీనియర్ హీరో జయరామ్ కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. మొత్తానికి త్రివిక్రమ్ సినిమాలో ఈ సారి ముగ్గురు సీనియర్ హీరోలు కనిపించబోతున్నారు అన్నమాట.

ఇక ఎన్టీఆర్ పాత్ర కూడా రాజకీయాలకి ముడిపడి ఉంటుందట. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నట్లు.. అందులో ఒక హీరోయిన్ ను బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను తీసుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ నుండి షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు