ఝాన్సీ పాత్రలో ఛార్మి లుక్ అదిరిందిగా…!

Published on Aug 10, 2019 3:00 pm IST

ఛార్మి తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఓ అరుదైన ఫోటోని షేర్ చేసి “నటిగా ఇది నేను, నిర్మాత నా కొత్త అవతారం ఎలా ఉందో చెవుతారా?” అంటూ తన అభిమానులను అడిగారు. ఆ ఫోటోలో ఛార్మి 10 నుండి 13 ఏళ్ల వయసు కలిగిన అమ్మాయిగా కనిపిస్తున్నారు. చేతిలో కత్తి,డాలు పట్టుకొని ఝాన్సీ రాణి గెట్ అప్ లో ఛార్మి గంభీరమైన పాత్రలో క్యూట్ గా కనిపిస్తున్నారు. బహుశా ఛార్మి తన స్కూల్ డేస్ లో జరిగిన కల్చరల్ ప్రోగ్రామ్స్ భాగంగా ఝాన్సీ రాణి గెటప్ లో దిగిన ఫోటోలా ఉంది.

కాగా చార్మి తాజాగా నిర్మించిన ఇస్మార్ట్ శంకర్ మూవీ ఘవిజయం సాధించింది. దాదాపు 75కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ సాధించి డిస్ట్రిబ్యూటర్స్ కి లాభాలు పండించింది. కాగా మొన్నటి వరకు ఈ మూవీ సంబరాలలో గడిపిన పూరి,ఛార్మి టీం మరో క్రేజి ప్రాజెక్టుకి సిద్ధమవుతున్నారని సమాచారం.

సంబంధిత సమాచారం :