‘టిల్లు స్క్వేర్’ : మెలోడియస్ గా ఆకట్టుకుంటున్న ‘ఓ మై లిల్లీ’ సాంగ్

‘టిల్లు స్క్వేర్’ : మెలోడియస్ గా ఆకట్టుకుంటున్న ‘ఓ మై లిల్లీ’ సాంగ్

Published on Mar 18, 2024 11:26 PM IST

సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్స్ గా మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ టిల్లు స్క్వేర్. ఈ మూవీకి రామ్ మిరియాల, అచ్చు రాజమణి సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థల పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

ఇక నేడు ఈ మూవీ నుండి ఓ మై లిల్లీ అనే పల్లవితో సాగె మెలోడియస్ సాంగ్ ని రిలీజ్ చేసారు. శ్రీరామచంద్ర ఆలపించిన ఈ సాంగ్ ని సిద్దు, రవి ఆంటోనీ రచించగా మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు రాజమణి చక్కగా కంపోజ్ చేసారు. ప్రస్తుతం ఈ లిరికల్ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటూ యూట్యూబ్ లో బాగా వ్యూస్ రాబడుతోంది. కాగా టిల్లు స్క్వేర్ మూవీని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మార్చి 29న విడుదల చేయనున్నారు.

సాంగ్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు