ఓటిటిలో వచ్చాక “టిల్లు స్క్వేర్” కి ఇంట్రెస్టింగ్ రెస్పాన్స్

ఓటిటిలో వచ్చాక “టిల్లు స్క్వేర్” కి ఇంట్రెస్టింగ్ రెస్పాన్స్

Published on Apr 28, 2024 5:30 PM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కించిన లేటెస్ట్ సాలిడ్ ఎంటర్టైనర్ హిట్ చిత్రం “టిల్లు స్క్వేర్”. మరి ఈ చిత్రం సిద్ధూ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి తన కెరీర్ లో మొదట 100 కోట్ల గ్రాస్ సినిమాగా నిలిచింది. అయితే ఈ చిత్రం రీసెంట్ గానే ఓటిటిలో పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చింది.

దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు ఈ సినిమాని తీసుకురాగా దీనికి ఇంట్రెస్టింగ్ రెస్పాన్స్ ఇపుడు నమోదు అవుతుంది. అన్ని భాషలు వారు ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఒక్క తెలుగు ఆడియెన్స్ తప్ప. అవును.. ఎందుకంటే గతంలో డీజే టిల్లు చూసినవారు చాలా మంది ఓటిటిలో వచ్చాక టిల్లు స్క్వేర్ ని చూసారు.

దీనితో సోషల్ మీడియాలో తమకి మాత్రం మొదటి సినిమానే బాగా నచ్చింది అని చెప్తున్నారు. ఇక ఇంకో పక్క తమిళ్, హిందీ ఆడియెన్స్ కి మాత్రం టిల్లు స్క్వేర్ బాగానే ఎక్కినట్టు అనిపిస్తుంది. దీనితో వారు ఈ సినిమాపై పాజిటివ్ రెస్పాన్స్ అందిస్తున్నారు. దీనితో ఓటిటిలో వచ్చాక ఒకింత డిఫరెంట్ స్పందనే ఈ చిత్రానికి వస్తుంది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు