టాక్..రజినీ, నెల్సన్ ల సినిమా మొదలు అప్పుడు నుంచే అట.!

Published on May 18, 2022 8:00 am IST

కోలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ తలైవర్ రజినీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “అన్నాత్తే” తమిళ నాట మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. కానీ ఓవరాల్ గా అయితే ఇది కూడా రజినీ రేంజ్ సినిమా కాదనే ఒక బలమైన టాక్ వచ్చింది. ఇక దీనితో తన నెక్స్ట్ సినిమాల కోసం అభిమానులు ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.

అయితే ఆ లైనప్ లో తన కెరీర్ లో 168వ సినిమాగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో ఓ సినిమా చెయ్యడానికి ఫిక్స్ అయ్యారు. అయితే నెల్సన్ తెరకెక్కించిన లాస్ట్ రెండు సినిమాలు డాక్టర్ మరియు బీస్ట్ లు మంచి టాక్ నే తెచుకున్నాయి. దీనితో రజినీ ప్రాజెక్ట్ పై అయితే అభిమానులు కాస్త ఎగ్జైటింగ్ గానే ఉన్నారు.

మరి ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలు కానుందో తెలుస్తోంది. మరి లేటెస్ట్ టాక్ ప్రకారం అయితే ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టు నుంచి మొదలు కానుందట. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు కూడా అనిరుద్ నే సంగీతం అందిస్తున్నాడు అలాగే సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహించనున్నారు.

సంబంధిత సమాచారం :