జై సింహ షోకు ముహూర్తం ఖరారు !
Published on Jan 11, 2018 6:19 pm IST


బాలకృష్ణ నయనతార నటించిన జై సింహా సినిమాపై భారి అంచనాలు ఉన్నాయి. రేపు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఉదయం ఆట హైదరాబాద్ లో 6:30 నిమిషాలకు ప్రారంభం కానుంది. కుకట్ పల్లి బ్రమరాంభ మల్లికార్జున థియేటర్స్ లో ఈ సినిమా ప్రదర్శింపబడుతుంది. సీనియర్ డైరెక్టర్ కెఎస్.రవికుమార్ డైరెక్షన్ లో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు.

బాలయ్య నటించిన 103వ సినిమా కావడం, ఎమ్.రత్నం కథ మాటలు అందించడం, చిరతన్ భట్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం కానున్నాయి. సినిమాలో సెంటిమెంట్ సన్నివేశాలు బాగా వచ్చాయని తెలుస్తోంది. అలాగే బాలయ్య డైలాగ్స్ హైలెట్ కాబోతున్నాయని సమాచారం.

 
Like us on Facebook