ఎం ఎస్ రాజు “7 డేస్ 6 నైట్స్” ఫస్ట్ లుక్ కి టైం ఫిక్స్.!

Published on Jul 21, 2021 12:51 pm IST

తన “డర్టీ హరి” సినిమాతో టాలీవుడ్ లో మంచి ఇంపాక్ట్ కలిగించిన ప్రముఖ నిర్మాత మరియు దర్శకుడు ఎం ఎస్ రాజు మంచి బజ్ నమోదు చేశారు. సరిగ్గా నేటి తరానికి కూడా అర్ధం అయ్యేలా ఒక గుడ్ కాన్సెప్ట్ ని తీసి హిట్ అందుకున్నారు. మరి ఈ సినిమా సక్సెస్ తర్వాత మళ్ళీ అదే తరహాలో ప్లాన్ చేసిన కొత్త చిత్రమే “7 డేస్ 6నైట్స్” చిత్రం. కొత్త నటీనటులతో ప్లాన్ చేసిన ఈ సరికొత్త కాన్సెప్ట్ చిత్రం కొన్నాళ్ల కితమే రెగ్యులర్ షూట్ ని స్టార్ట్ చేసుకున్న ఈ చిత్రం..

ఇపుడు ఫస్ట్ లుక్ లాంచ్ కి సిద్ధం అయ్యింది. రేపు ఉదయం 11 గంటల 11 నిమిషాలకు ఈ సినిమా ఫస్ట్ లుక్ ని లాంచ్ చెయ్యాలని మేకర్స్ ఫిక్స్ చేశారు. ఇది వరకు తాను తీసిన డర్టీ హరి పోస్టర్ కి మంచి రెస్పాన్స్ అప్పుడు వచ్చింది. మరి ఈ రాబోయే న్యూ ఏజ్ సినిమా పోస్టర్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి సమర్థ్ గొల్లపూడి సంగీతం అందిస్తుండగా నిర్మాతలు: సుమంత్ అశ్విన్, రజనీకాంత్ .ఎస్, రచన, దర్శకత్వం: ఎంఎస్ రాజు వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :