భర్త మహాశయులకు విజ్ఞప్తి.. టీజర్‌కు టైమ్ ఫిక్స్..!

భర్త మహాశయులకు విజ్ఞప్తి.. టీజర్‌కు టైమ్ ఫిక్స్..!

Published on Dec 18, 2025 6:01 PM IST

Bhaktha

మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తుండగా ఈ చిత్రం పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రానున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

ఈ క్రమంలో ఈ సినిమా నుండి టీజర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. ఈ చిత్ర టీజర్‌ను డిసెంబర్ 19న సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు ఓ సరికొత్త పోస్టర్‌తో ఈ విషయాన్ని వెల్లడించారు.

ఇక ఈ సినిమాలో రవితేజ సరసన అందాల భామలు డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు.

తాజా వార్తలు