‘జైలర్ 2’ వన్ నేమ్ కి టైం ఫిక్స్!

‘జైలర్ 2’ వన్ నేమ్ కి టైం ఫిక్స్!

Published on Sep 29, 2026 4:05 PM IST

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో విద్యా బాలన్, ఎస్ జే సూర్య తదితర అనేకమంది స్టార్ నటీనటులు తో చేసిన భారీ సీక్వెల్ సినిమానే జైలర్ 2. సాలిడ్ హైప్ లో ఉన్న ఈ సినిమా విడుదల ఎప్పుడెప్పుడా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమా నుంచి ఆల్రెడీ వచ్చిన రెండు పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ దీని తర్వాత ప్లాన్ చేసిన మూడో సాంగ్ అది కూడా మాస్ సాంగ్ వన్ నేమ్ కి ఇప్పుడు మేకర్స్ టైం ఫిక్స్ చేశారు. అనిరుద్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ని నేడు సాయంత్రం 6 గంటలకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ అవైటెడ్ సినిమా అక్టోబర్ 15న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు