మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో త్వరలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. ‘గాడ్ ఆఫ్ వార్’ అనే టైటిల్‌తో ఈ మూవీ రానుందనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఈ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ స్వయంగా తాజాగా కీలక అప్డేట్ ఇచ్చారు.
విక్టరీ వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం’ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా త్రివిక్రమ్-ఎన్టీఆర్ మూవీపై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన స్క్రిప్ట్ రెడీగా ఉందని త్రివిక్రమ్ వెల్లడించారు. అయితే, ఈ ప్రాజెక్ట్‌కు టైటిల్‌ను ఇంకా ఫిక్స్ చేయలేదని ఆయన అన్నారు.
దీంతో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కాస్ట్ అండ్ క్రూ వివరాలతో పాటు, అధికారిక టైటిల్ అనౌన్స్‌మెంట్‌ను కూడా మేకర్స్ గ్రాండ్‌గా చేయనున్నట్లు సమాచారం. ఈ ప్రకటనతో అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.


