ఎన్టీఆర్ 30: ఫస్ట్ లుక్ కి టైమ్ ఫిక్స్!

Published on May 18, 2023 7:43 pm IST

నిన్న ఎన్టీఆర్ 30 ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రకటనతో అభిమానులను ఉత్సాహపరిచారు మేకర్స్. క్యాప్షన్ మరియు పోస్టర్ సినిమాపై పూర్తి పాజిటివ్ వైబ్స్ ఇచ్చాయి. ఈ చిత్రం హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ అని కూడా వారు సూచిస్తున్నారు. తారక్ యొక్క ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ రేపు సాయంత్రం 07:02 గంటలకు రిలీజ్ కానుంది. ఫస్ట్ లుక్ విడుదల సమయాన్ని ప్రకటించేందుకు పవర్ ఫుల్ క్యాప్షన్‌తో సూపర్ పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది.

యంగ్ టైగర్‌ని కొరటాల శివ ఎలా ప్రెజెంట్ చేస్తాడో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై హరికృష్ణ కె, మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :