రౌడీ హీరో పాన్ ఇండియన్ సినిమా ఫస్ట్ లుక్ కు ఆల్ సెట్.!

Published on Jan 17, 2021 11:16 am IST

మన టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా పరిచయం అయిన ఆనతి కాలంలోనే విపరీతమైన ఫాలోయింగ్ ను సంతరించుకున్నాడు. మన దగ్గర నిలదొక్కుకోవడమే కాకుండా ఇతర ఇండస్ట్రీల్లో కూడా తన హవా చూపించడం స్టార్ట్ చేసాడు. మరియా అలా విజయ్ అనౌన్స్ చేసిన మరో సాలిడ్ ప్రాజెక్ట్ “ఫైటర్”.

మాస్ అండ్ స్టైలిష్ దర్శకుడు పూరి జగన్నాథ్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఇంకా టైటిల్ ఖరారు అయ్యినట్టు అధికారికంగా చెప్పలేదు కానీ ఈ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టైటిల్ ను అనౌన్స్ చెయ్యడానికి మేకర్స్ టైం సెట్ చేసేసారు.

బాలీవుడ్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ వారు అలాగే పూరి టీం ఈ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రేపు జనవరి 18 ఉదయం 10 గంటల 8 నిమిషాలకు విడుదల చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించేసారు. మరి టైటిల్ అదేనా కాదా అన్నది ఇంకో రోజులో రివీల్ అయ్యిపోనుంది.

సంబంధిత సమాచారం :