మెగా హీరో మూవీ టైటిల్ మారింది !

Published on May 5, 2019 3:24 pm IST

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడని తెలిసిందే. వైష్ణవ్ హీరోగా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ఇటీవలే ఈ చిత్రం గ్రాండ్ గా లాంచ్ కాగా మే నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఇక జాలర్ల నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘జాలరి’ అనే టైటిల్ పెట్టనున్నారని ఇటీవల ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఈసినిమా కోసం మరో టైటిల్ తెర మీదకు వచ్చింది. ఈచిత్రానికి ‘ఉప్పెన’ అనే టైటిల్ ను ఫిక్స్ చేయనున్నారట. మేకర్స్ ఈ టైటిల్ ను రిజిస్టర్ కూడా చేయించారని సమాచారం. ఈ చిత్రంలో ప్రముఖ తమిళ హీరో విజయ్ సేతుపతి విలన్ రోల్ లో నటించనున్నాడు. సుకుమార్ రైటింగ్స్ ,మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.

సంబంధిత సమాచారం :

More