ప్రభాస్ 20 కి ఆ టైటిల్ కంఫర్మ్ అయ్యినట్లే ?

Published on Jan 10, 2019 8:45 am IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రెండు చిత్రాలతో బిజీ గా వున్నాడు. అందులో ఒకటి సుజీత్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదలకానుంది. ఇక ఈచిత్రంతో పాటు ప్రభాస్ తన 20 చిత్రంలో కూడా నటిస్తున్నారు. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. ఇక ఈచిత్రానికి జాన్ అనే టైటిల్ ను పెడుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఈ చిత్రానికి విజువల్స్ అందిస్తున్న కమల్ కణ్ణన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘జాన్’ చిత్రం ఇటలీ లో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుందని అన్నారు. దాంతో ఆ టైటిల్ నే ఫిక్స్ చేశారని తెలుస్తుంది.

పీరియాడికల్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ కొత్త లుక్ లో కనబడనున్నాడు. గోపికృష్ణ మూవీస్ ,యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రం ఈఏడాది చివర్లో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :