మెగా హీరో సినిమా టైటిల్ అదేనా ?

Published on Dec 3, 2020 2:00 am IST

మెగా కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన కొత్త వ్యక్తి వైష్ణవ్ తేజ్. ఆయన నటించిన మొదటి చిత్రం ‘ఉప్పెన’ అన్ని పనులు పూర్తిచేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. లాక్ డౌన్ లేకపోయి ఉంటే ఈపాటికి సినిమా విడుదలయ్యేదే. కానీ లాక్ డౌన్ కారణంగా వాయిదాపడుతూ వచ్చింది. ఒక్కసారి థియేటర్లు తెరుచుకుంటే సినిమా విడుదలపై క్లారిటీ వచ్చేస్తుంది. ఇలా ఒక సినిమా విడుదల సన్నాహాల్లో ఉండగానే రెండు సినిమా చేసేశాడు వైష్ణవ్ తేజ్.

ఆయన రెండవ చిత్రాన్ని డైరెక్ట్ చేసింది క్రిష్. పెద్దగా హడావిడి లేకుండానే సినిమా మొదలుపెట్టి, చిత్రీకరణ ముగించేశారు టీమ్. ఏకధాటిగా జరిగిన 45 రోజుల షెడ్యూల్లో షూటింగ్ మొత్తం ముగిసింది. ప్రముఖ నవలా రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన `కొండపొలం` నవలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కినట్టు తెలుస్తోంది. అందుకే సినిమాకు ‘కొండపొలం’ అనే పేరునే పెట్టాలని అనుకుంటున్నారట. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబా నిర్మించిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయకిగా నటించడం జరిగింది.

సంబంధిత సమాచారం :

More