పూరి – రామ్ కాంబినేషన్ లో ‘ఇస్మాట్ శంకర్’ !

Published on Jan 3, 2019 4:09 pm IST

స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ హీరో రామ్ తో ఒక చిత్రం తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ మరియు టైటిల్ పోస్టర్ ను చిత్రబృందం ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు విడుదల చేసింది. ‘స్మార్ట్ శంకర్’ పేరుతో వచ్చిన ఈ పోస్టర్ మొత్తానికి ఆకట్టుకునే విధంగానే ఉంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

అయితే గత కొన్ని సంవత్సరాలుగా దర్శకుడు పూరి జగన్నాథ్ నుండి నిరాశపరిచే సినిమాలే ఎక్కువుగా వస్తున్నాయి. కానీ రామ్ – పూరి కలయికలో మొదటి సారి సినిమా వస్తుండటంతో ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ చిత్రాన్ని కూడా పూరి టూరింగ్ టాకీస్ పతాకం ఫై పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మిస్తుండటం విశేషం.

ఈ సినిమాలో రామ్ న్యూ లుక్ లో కనిపించనున్నాడు. అయితే ఈ చిత్రం ఎలా ఉండబోతుంది, ఏ జోనర్ లో తెరకెక్కబోతుంది..? ఇతర నటీనటులెవరు అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

X
More