‘వకీల్ సాబ్’.. ఈరోజు ఎలాంటి అప్డేట్ ఉండదు

Published on Mar 25, 2020 7:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న కొత్త చిత్రం ‘వకీల్ సాబ్’. చివరి దశ షూటింగ్లో ఉన్న ఈ సినిమాను మే నెలలో విడుదల చేయాలని మొదటి నుండి అనుకుంటున్నారు టీమ్. అందులో భాగంగానే ఈరోజు ఉగాదికి అభిమానుల కోసం టీజర్ లాంటి సప్రైజ్ ఏదైనా ఇవ్వాలని ప్లాన్ చేశారు. కానీ కరోనా వైరస్ లాక్ డౌన్ ప్రభావంతో షూటింగ్ కాస్త నిలిచిపోయింది. దీంతో టీజర్ కంటెంట్ రెడీ కాలేదు.

కానీ అభిమానులు మాత్రం ఈరోజు పండుగ కావడంతో ‘వకీల్ సాబ్’ టీమ్ నుండి టీజర్ కాకపోయినా ఏదో ఒక అప్డేట్ ఉంటుందని ఆశిస్తున్నారు. అయితే సన్నిహిత వర్గాల సమాచారం మేరకు ఈరోజు ఎలాంటి సప్రైజెస్ ఉండవని నిర్థారణ అయింది. ఇక విడుదల కూడా మే నెలలో ఉండకపోవచ్చట. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More