అదే పని మన హీరోలు కూడా చేయాలి

Published on Mar 24, 2020 1:29 pm IST

సినీ రంగం పూర్తిగా మూతబడటంతో రోజువారీ జీతాల మీద ఆధారపడి బ్రతికేవారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారి ఇబ్బందిని గమనించిన తమిళ హీరోలు తమవంతుగా సినీ కార్మికుల కోసం డొనేషన్లు అందిస్తున్నారు. ఇప్పటికే సూర్య, కార్తి, శివ కార్తికేయన్, విజయ్ సేతుపతిలు ఒక్కొక్కరు రూ.10 లక్షలు డొనేట్ చేయగా రజనీకాంత్ ఒక్కరే రూ.50 లక్షలు అందించారు. మొత్తం కోటి రూపాయలు కలెక్ట్ చేసి కార్మికులకు నిత్యావసరాలు అందివ్వాలనేది కొలీవుడ్ సినీ పెద్దల ఉద్దేశ్యం.

ఇక టాలీవుడ్ సినీ కార్మికుల పరిస్థితి కూడా ఇలానే ఉంది. దాదాపు పది రోజులుగా షూటింగ్స్ లేకపోవడంతో కార్మికులకు ఆదాయం లేకుండా పోయింది. ఈ పరిస్థితి 31 లేదా అంతకు పైగానే కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే అనేక విధాలుగా ఇండస్ట్రీ జనాల సంక్షేమం కోసం సహాయం అందించిన మన హీరోలు ఈ కష్ట కాలంలో కూడా కార్మికుల సంక్షేమం కోసం తమవంతు సహకారాన్ని అందిస్తే బాగుంటుంది. ఇప్పటికే ఈ దిశగా మన సినీ పెద్దలు కార్యాచరణను మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :

X
More