ఛాలెంజ్‌ యాక్సెప్టెడ్ అంటున్న తెలుగు హీరో హీరోయిన్లు

Published on Jul 19, 2019 1:30 am IST

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఒక బకెట్ ఛాలెంజ్ విస్తృతంగా నడుస్తోంది. జూలై 21 అనగా ఈ ఆదివారం రోజున రోజు వారీ కాలకృత్యాలు అనగా బ్రషింగ్, పేస్ వాష్, బాటింగ్, హ్యాండ్ వాష్ లాంటి వాటిని కేవలం ఒక్క బకెట్ నీటిని మాత్రమే వాడాలనేది ఈ ఛాలెంజ్ సారాంశం. దీని ద్వారా నీటిని అధిక మొత్తంలో ఆదా చేయవచ్చు. ఇప్పటికే చెన్నై తీవ్రమైన నీటి ఎద్దడితో ఇబ్బందిపడుతోంది. భవిష్యత్తులో హైదరాబాద్, ఇతర ప్రాంతాలు అలా కాకూడదనేదే ఈ ఛాలెంజ్ ముఖ్య ఉద్దేశ్యం.

మెల్లగా మొదలైన ఛాలెంజ్‌ను మన హీరో హీరోయిన్లు ముందుకొచ్చి టేకప్ చేస్తున్నారు. వారిలో సమంత, వరుణ్ తేజ్, నాగ్ అశ్విన్, అడివి శేష్, సాయి ధరమ్ తేజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వంటి వారున్నారు. వీరంతా 21న కేవలం ఒక బకెట్ నీటిని మాత్రమే వాడతామని ఛాలెంజ్ చేస్తూ జనాన్ని సైతం ఛాలెంజ్ టేకప్ చేయమని అవగాహన కలిగిస్తున్నారు. సమాజహితమైన ఇలాంటి ఛాలెంజెస్ పట్ల మన సెలబ్రిటీలు ఇంత వేగంగా రియాక్ట్ కావడం హర్షించదగిన విషయం.

సంబంధిత సమాచారం :

X
More